డైలీ మిర్రర్ డాట్ న్యూస్, హైదరాబాద్, మార్చి 25,2026: పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు గోద్రెజ్ అప్లయన్సెస్ సరికొత్త ఏసీల శ్రేణిని మార్కెట్లోకి తెచ్చింది. 2026 వేసవి సీజన్ కోసం అత్యాధునిక ‘స్మార్ట్ సింక్’ సాంకేతికతతో కూడిన ఎయిర్ కండిషనర్లను బుధవారం ఆవిష్కరించింది.
గది ఉష్ణోగ్రతను బట్టి ఫ్యాన్ నియంత్రణ..
దేశీ మార్కెట్లోనే తొలిసారిగా గోద్రెజ్ పరిచయం చేసిన ‘స్మార్ట్ సింక్’ టెక్నాలజీ ద్వారా ఏసీలు గదిలోని ఫ్యాన్‌తో అనుసంధానమవుతాయి. వై-ఫై సదుపాయం ఉన్న ఈ ఏసీలు, గది ఉష్ణోగ్రతను బట్టి ఫ్యాన్ వేగాన్ని వాటంతట అవే సర్దుబాటు చేస్తాయి. దీనివల్ల అర్ధరాత్రి వేళ ఫ్యాన్ స్విచ్ వేయడానికి లేదా ఆపడానికి నిద్ర లేవాల్సిన అవసరం ఉండదు.
ఇదీ చదవండి..తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక.. శాఖమూరులో ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ సిద్ధం..!
ఇదీ చదవండి..భారత ఆరోగ్య రంగంలో భారీ విలీనం: ఆస్టర్ – క్యుసిఐఎల్ (QCIL) కలయికకు వాటాదారుల పచ్చజెండా..
నిరంతర సౌకర్యం కోసం ఏసీయే ఫ్యాన్‌ను మేనేజ్ చేస్తుంది. ఐఓటీ ఆధారితమైన ఈ ఏసీల ద్వారా విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించడంతో పాటు, ఫిల్టర్ క్లీనింగ్ అలర్ట్‌లు, స్మార్ట్ డయాగ్నోస్టిక్స్ వంటి ఫీచర్లను పొందవచ్చు.
125కి పైగా మోడళ్లు..
వినియోగదారుల కోసం ఒక టన్ను నుంచి 4 టన్నుల సామర్థ్యం వరకు వివిధ రకాల మోడళ్లను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో స్ప్లిట్, క్యాసెట్, టవర్, విండో ఏసీలు ఉన్నాయి. ముఖ్యంగా ‘ఇయాన్ మాగ్నస్’, ‘ఇయాన్ నింబస్’, ‘ఇయాన్ రెగాలిస్’ వంటి ప్రీమియం సిరీస్‌లను ఆకర్షణీయమైన రంగుల్లో ప్రవేశపెట్టింది. గ్లాస్ బ్లాక్, మ్యాట్ సిల్వర్, షాంపైన్ గోల్డ్ వంటి రంగుల్లో ఇవి లభిస్తాయి.

40 శాతం వృద్ధిపై కన్ను..
గోద్రెజ్ అప్లయన్స్ బిజినెస్ హెడ్ కమల్ నంది మాట్లాడుతూ.. ‘‘గత ఏడాది ఏసీ పరిశ్రమ ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, గోద్రెజ్ మాత్రం మెరుగైన వృద్ధిని సాధించింది. మా అధునాతన ప్రొడక్ట్ లైనప్, 5 ఏళ్ల పారదర్శకమైన సమగ్ర వారంటీ, రిటైల్ నెట్వర్క్ విస్తరణ ద్వారా ఈ వేసవిలో 30 నుంచి 40 శాతం అమ్మకాల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని వివరించారు.
ఏఐ ఆధారిత హెవీ డ్యూటీ కూలింగ్‌తో పాటు, గది అంతటా చల్లదనం ఇచ్చే ‘4-వే స్వింగ్’ ఫీచర్ ఈ ఏసీల ప్రత్యేకత అని ఏసీ ప్రొడక్ట్ గ్రూప్ హెడ్ సబ్యసాచి గుప్తా పేర్కొన్నారు. ఎటువంటి దాగి ఉన్న ఖర్చులు లేని 5 ఏళ్ల వారంటీలో గ్యాస్ రీఫిల్స్, టెక్నీషియన్ విజిట్స్ కూడా కలిసి ఉంటాయని ఆయన తెలిపారు.

