డైలీ మిర్రర్ డాట్ న్యూస్,9 మే 2026: గీతమ్ డీమ్డ్ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి గాను విశాఖపట్నం, హైదరాబాద్,బెంగళూరు క్యాంపస్‌లలో పీహెచ్డీ ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తులను సమర్పించేందుకు 2026 మే 11 ఆఖరు తేది.
ఫుల్-టైమ్ పీహెచ్డీ ప్రోగ్రామ్‌లో చేరే పరిశోధకులకు గరిష్టంగా మూడేళ్ల పాటు నెలకు రూ. 33,000 చొప్పున ఫెలోషిప్ అందజేస్తారు. వీటితో పాటు అత్యాధునిక పరిశోధనా సౌకర్యాలు, అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లు,వర్క్‌షాప్‌లకు హాజరయ్యేందుకు తోడ్పాటు లభిస్తుంది. అలాగే జాతీయ ప్రయోగశాలలు, పరిశ్రమల నిపుణులు,విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి వివిధ ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం కూడా వీరికి ఉంటుంది.
Read this also..GITAM Opens Ph.D. Admissions 2026 with Fellowship and Translational Research Support..
Read this also..ISB Welcomes 839 Students to PGP Class of 2027 in Its Silver Jubilee Year
ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్,సోషల్ సైన్సెస్, ఫార్మసీ, లా, ఆర్కిటెక్చర్ ,పబ్లిక్ పాలసీ వంటి విభాగాల్లో అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక ప్రక్రియలో భాగంగా ‘గ్రేట్’ (GReAT – GITAM Research Admissions Test) పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అయితే సిఎస్ఐఆర్ (CSIR), యూజీసీ నెట్ (UGC NET), గేట్ (GATE), జీప్యాట్ (GPAT), ఐకార్ (ICAR) లేదా డీబీటీ-జేఆర్ఎఫ్ (JRF)లలో అర్హత సాధించిన అభ్యర్థులకు ‘గ్రేట్’ ప్రవేశ పరీక్ష నుండి మినహాయింపు ఉంటుంది. వారు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
గీతమ్ పరిశోధనలకు ‘మూర్తి’ (MURTI – Multidisciplinary Unit of Research on Translational Initiatives) విభాగం మద్దతునిస్తోంది. ఇందులో 300 మందికి పైగా నిపుణులు,వివిధ పరిశోధనా బృందాలు ఉన్నాయి. మల్టీడిసిప్లినరీ పరిశోధనల కోసం రూ. 100 కోట్లకు పైగా వెచ్చించిన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
ఇదీ చదవండి :భారతీయ రైల్వేలో కొత్త శకం: 9000 HP విద్యుత్ లోకోమోటివ్లను అప్పగించిన సీమెన్స్!
ఇదీ చదవండి :విజయవాడలో బిర్లా పివోట్ తొలి అనుభవ కేంద్రం ప్రారంభం!
మూర్తి (MURTI) విభాగం ప్రధానంగా ఆరు రంగాలపై దృష్టి సారిస్తుంది. బేసిక్ సైన్సెస్, మొబిలిటీ టెక్నాలజీస్, మెటీరియల్స్ & మాన్యుఫ్యాక్చరింగ్, కమ్యూనికేషన్, అగ్రికల్చర్,సెన్సార్ టెక్నాలజీస్ వీటిలో ఉన్నాయి. వివిధ విభాగాలు కలిసి చేసే పరిశోధనల ద్వారా క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం కనుగొనేలా ఈ వేదికను తీర్చిదిద్దారు.

పరిశోధకులకు ఐ-స్టెమ్ (I-STEM) ప్లాట్‌ఫామ్ ద్వారా అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉంటాయి. ఇందులో 500 MHz NMR స్పెక్ట్రోస్కోప్, పౌడర్ ఎక్స్-రే డిఫ్రాక్టోమీటర్, ఎల్సీ-ఎంఎస్ హెచ్ఆర్ఎంఎస్ సిస్టం, గ్యాస్ క్రోమాటోగ్రాఫ్-మాస్ స్పెక్ట్రోమీటర్, ఫీల్డ్ ఎమిషన్ స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, కాన్ఫోకల్ లేజర్ స్కానింగ్ మైక్రోస్కోప్, ఫ్లో సైటోమీటర్, ఫ్లోరెసెన్స్-యాక్టివేటెడ్ సెల్ సోర్టింగ్ సిస్టం, 3డీ ప్రింటర్స్ , సీఎన్సీ మెషినింగ్ యంత్రాలు మొదలైనవెన్నో ఉన్నాయి. ఇవి జెనోమిక్స్, నానోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ అనాలసిస్,అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో పరిశోధనలకు ఎంతో ఉపయోగపడతాయి.
గీతమ్ యొక్క పీహెచ్డీ అడ్మిషన్స్ కమ్యూనికేషన్స్ మరియు సంస్థాగత గణాంకాల ప్రకారం, వర్సిటీ ఇప్పటివరకు 300కు పైగా పేటెంట్లు సాధించడమే కాకుండా 370 పైచిలుకు పరిశోధనా ప్రాజెక్టులను పూర్తి చేసింది. స్కోపస్ (Scopus) హెచ్-ఇండెక్స్ 100గా ఉంది.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 మే 11వ తేదీలోపు researchadmissions.gitam.edu వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

