డైలీ మిర్రర్ డాట్ న్యూస్, ముంబై,మే 10,2026: లార్సెన్ & టూబ్రో (ఎల్&టీ) సంస్థకు చెందిన  సార్వభౌమ (సావరీన్)  ఏఐ క్లౌడ్,డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగమైన ‘లార్సెన్ & టూబ్రో వ్యోమ’ (వ్యోమ), ‘ఓపెన్ ధీ గ్రూప్’ (Open Dhi Group) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా Open Dhiకి చెందిన వ్యాపార, రిటైల్ సాంకేతిక ప్లాట్‌ఫామ్‌లను భారతదేశంలోనే ఉన్న వ్యోమ సురక్షిత క్లౌడ్ మౌలిక సదుపాయాలపై హోస్ట్ చేసి, మరింత విస్తరిస్తారు.

నేటి తరుణంలో వ్యాపార సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని, డిజిటల్ పరివర్తనను మరియు ఓమ్నీ-ఛానల్ కామర్స్‌ను వేగంగా పెంచుకుంటున్నాయి. దీనివల్ల ఏకీకృతమైన,  సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న డిజిటల్ వ్యవస్థలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ భాగస్వామ్యమనేది వ్యోమ యొక్క సార్వభౌమ క్లౌడ్‌ను, Open Dhi యొక్క వ్యాపార ప్లాట్‌ఫామ్‌లతో మేళవిస్తుంది.  దీనివల్ల డేటా  అంతా భారతదేశంలోనే భద్రంగా ఉంటూ (డేటా రెసిడెన్సీ), డిజిటల్ వ్యవస్థలు వేగంగా విస్తరించడానికి వీలవుతుంది.

Read this also..L&T Vyoma and Open Dhi Group Partner to Boost India’s Sovereign Digital Infrastructure.

Read this also..Eris delivers 11% yoy growth in Domestic Formulations with 37% EBIDTA margin in FY26..

Open Dhi సంస్థ తన ప్లాట్‌ఫామ్‌లైన DhiERP+ (ఏఐ ఆధారిత ఓపెన్-సోర్స్ ఎంటర్‌ప్రైజ్ ఈఆర్‌పీ), DhiADT+ (ఉద్యోగుల నిర్వహణ, గ్లోబల్ పే రోల్ ప్లాట్‌ఫామ్) మరియు Bhaiyaa (హైపర్ లోకల్ ఆమ్నీ-ఛానల్ మార్కెట్‌ప్లేస్ ప్లాట్‌ఫామ్)లను వ్యోమ క్లౌడ్‌పై ప్రవేశపెడుతుంది. ఇది ‘డబుల్ శాండ్‌విచ్ టెక్నాలజీ’ ఆర్కిటెక్చర్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది మార్కెట్‌ప్లేస్ లేయర్, ఏఐ ఆధారిత వ్యాపార వ్యవస్థలు, సార్వభౌమ క్లౌడ్ మౌలిక సదుపాయాలను ఒకే చోట అనుసంధానిస్తుంది.

దీనివల్ల వ్యాపార సంస్థలు తమ డేటాపై పూర్తి నియంత్రణను కలిగి ఉంటూనే.. ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి,యాజమాన్య పర్యవేక్షణను బలోపేతం చేసుకోవడానికి వీలవుతుంది. ఈ ఉమ్మడి సేవలు వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించుకోవడానికి, పారదర్శకతను పెంచుకోవడానికి,మొదటి నుండి చివరి వరకు అన్ని పనులను సులభంగా నిర్వహించుకోవడానికి ఒక ఏకీకృత డిజిటల్ పునాదిని ఏర్పరుస్తాయి.

ఇదీ చదవండి :ఫెలోషిప్ ,ట్రాన్స్‌లేషనల్ పరిశోధనలకు మద్దతుతో గీతమ్ (GITAM)పీహెచ్‌డీ అడ్మిషన్ల నోటిఫికేషన్2026 విడుదల

Read this also..GITAM Opens Ph.D. Admissions 2026 with Fellowship and Translational Research Support..

“భారతదేశం ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకుపోతున్న తరుణంలో, సురక్షితమైన,సార్వభౌమ క్లౌడ్ మౌలిక సదుపాయాలు చాలా కీలకంగా ఉంటున్నాయి. ఈ మార్పునకు మద్దతుగా వ్యోమ భారతదేశంలోనే హోస్ట్ చేయబడే సురక్షితమైన మౌలిక సదుపాయాలను అందిస్తోంది. 

OpenDhiతో మా భాగస్వామ్యం వల్ల వ్యాపార సంస్థలు నమ్మకమైన స్వదేశీ ప్లాట్‌ఫామ్‌లపై తమ సేవలను విస్తరించుకోగలుగుతాయి” అని లార్సెన్ & టూబ్రో వ్యోమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సీమా అంబస్థ తెలిపారు.

“ఈ భాగస్వామ్యం వల్ల మా ప్లాట్‌ఫామ్‌లు విస్తరణకు అనువైన, అత్యంత సురక్షితమైన సార్వభౌమ మౌలిక సదుపాయాలపై పనిచేస్తాయని నమ్మకం కలిగింది. మా సమగ్ర సాంకేతికత వ్యాపార సంస్థలు వృద్ధిని సాధించడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి,వారి డిజిటల్ వ్యవస్థలపై పూర్తి నియంత్రణను కలిగి ఉండటానికి సహాయపడుతుంది” అని Open Dhi గ్రూప్ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ రాచా (Shrinivas Racha) తెలిపారు.

ఈ భాగస్వామ్యమనేది భారతదేశ స్వదేశీ డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి మద్దతుగా నిలుస్తుంది. అలాగే వ్యాపార సంస్థలు ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో మరింత వృద్ధి చెందడానికి సహాయపడుతుంది.