డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ముంబై,మే 5, 2026 :భారత్‌లో అగ్రగామి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలలో ఒకటైన యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, తమ కొత్త ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్‌వో) – ‘యాక్సిస్ నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్స్ ఇండెక్స్ ఫండ్’ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఇది ‘నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్స్ టోటల్ రిటర్న్ ఇండెక్స్’ (టీఆర్ఐ)కి అనుగుణంగా ఉండే ఓపెన్-ఎండెడ్ ఇండెక్స్ ఫండ్.

వేగంగా విస్తరిస్తున్న భారతీయ క్యాపిటల్ మార్కెట్ వ్యవస్థలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. ఈ ఎన్ఎఫ్ఓ 2026 మే 4న ప్రారంభమై, 2026 మే 15న ముగుస్తుంది. ట్రాకింగ్ ఎర్రర్లకు లోబడి, వ్యయాలకు ముందు, నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్స్ టీఆర్ఐ పనితీరుకు అనుగుణంగా రాబడులను అందించడమే ఈ ఫండ్ లక్ష్యం.

భారత క్యాపిటల్ మార్కెట్ వృద్ధి ప్రస్థాన అవకాశాలను అందిపుచ్చుకోవడం

గడిచిన దశాబ్ద కాలంలో భారత మూలధన మార్కెట్లు నిర్మాణాత్మక మార్పులకు లోనయ్యాయి. పొదుపు మొత్తాలు ఆర్థిక రంగం వైపు మళ్లడం, దేశీయ మదుపర్ల భాగస్వామ్యం పెరగడం,వేగవంతమైన డిజిటలైజేషన్ ఇందుకు ప్రధాన కారణాలు.

Read this also..Axis Mutual Fund Launches Axis Nifty Capital Markets Index Fund

రాబోయే దశాబ్ద కాలంలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదగనున్న తరుణంలో, పెరుగుతున్న గృహ ఆదాయాలు ఆర్థిక పొదుపును మరింత విస్తరిస్తున్నాయి. రిటైల్ భాగస్వామ్యం పెరగడం, డీమ్యాట్ ఖాతాల సంఖ్య భారీగా పెరగడం,మ్యూచువల్ ఫండ్ల పట్ల ఆసక్తి పెరగడం వల్ల మార్కెట్ మరింత బలోపేతమైంది. అలాగే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వల్ల అన్ని ప్రాంతాల ప్రజలకు పెట్టుబడి పెట్టడం సులభతరమైంది.

మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో ఈ జోరు స్పష్టంగా కనిపిస్తోంది. 2026 మార్చి నాటికి నిర్వహణలోని ఆస్తుల సగటు విలువ (ఏయూఎం) దాదాపు రూ. 79 లక్షల కోట్లకు చేరుకుంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ (సిప్) పెట్టుబడులు కూడా రికార్డు స్థాయిలో ఉన్నాయి.

ఇదీ చదవండి :‘కృష్ణావతారం’ ట్రైలర్‌పై నాగార్జున ప్రశంసలు: రాధగా సుశ్మిత భట్ నటనకు ఫిదా..

అయినప్పటికీ, భారత ఏయూఎం,జీడీపీ నిష్పత్తి 20% కంటే తక్కువగానే ఉంది. ఇది ప్రపంచ సగటు కంటే చాలా తక్కువ. అంటే ఈ రంగంలో ఇంకా వృద్ధికి చాలా అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్స్ ఇండెక్స్ అనేది స్టాక్ ఎక్స్ఛేంజీలు, అసెట్ మేనేజర్లు, బ్రోకరేజ్ సంస్థలు,డిపాజిటరీల వంటి మార్కెట్ అనుబంధ వ్యాపారాల వృద్ధిలో పెట్టుబడిదారులకు భాగస్వామ్యం కల్పిస్తుంది.

ఇదీ చదవండి :టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తోంది‘శుభ్ హెల్త్ క్రిటీ’: మీతో పాటే పెరిగే హెల్త్ ఫండ్

యాక్సిస్ నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్స్ ఇండెక్స్ ఫండ్ ప్రత్యేకతలు

ఈ ఫండ్ ప్రధానంగా క్యాపిటల్ మార్కెట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించే వివిధ కంపెనీల బాస్కెట్‌లో పెట్టుబడి పెడుతుంది. ఈ ఇండెక్స్‌లో నిఫ్టీ 500 పరిధిలోకి వచ్చే అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, ఎక్స్ఛేంజీలు, డేటా ప్లాట్‌ఫామ్‌లు, స్టాక్ బ్రోకింగ్ సంస్థలు,డిపాజిటరీ సర్వీసెస్ వంటి కంపెనీలు ఉంటాయి. ఈ సూచీ ‘ఫ్రీ-ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్’ పద్ధతిని అనుసరిస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షించబడుతుంది.

“భారత మూలధన మార్కెట్లు ఇప్పుడు మరింత లోతైన, క్రియాశీలక దశలోకి ప్రవేశిస్తున్నాయి. దేశీయ పెట్టుబడులు, రిటైల్ మదుపర్లు చురుగ్గా పాలుపంచుకుంటూ ఉండటం, పొదుపు మొత్తాల క్రమబద్ధీకరణ ఇందుకు బలాన్నిస్తున్నాయి.

మేము దీనిని కేవలం మార్కెట్ వృద్ధిగానే కాకుండా, ఈ వృద్ధికి సహకరించే మొత్తం ఆర్థిక వ్యవస్థకు లభించిన దీర్ఘకాలిక అవకాశంగా భావిస్తున్నాము. ఈ ఇండెక్స్ ఫండ్ ద్వారా పెట్టుబడిదారులు సులభంగా, పారదర్శకంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భాగస్వాములు కావచ్చు” అని ఫండ్ విడుదల సందర్భంగా యాక్సిస్ ఏఎంసీ ఎండీ, సీఈఓ బి. గోప్‌కుమార్ తెలిపారు.

తక్కువ ఖర్చుతో, పారదర్శకమైన,నియమాల ఆధారిత పెట్టుబడి విధానం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో భాగం కావాలనుకునే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఈ ఫండ్ చక్కని మార్గం. క్యాపిటల్ మార్కెట్ అభివృద్ధికి మూలస్తంభాలుగా ఉన్న సంస్థల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా, మదుపర్లు తమ పోర్ట్‌ఫోలియోను మార్కెట్ విస్తరణకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చు.

ఈ ఫండ్‌ను నందిక్ మల్లిక్,రోహిత్ గౌతమ్ పర్యవేక్షిస్తారు.